సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఇప్పటివరకు కాచిన ప్రచండ ఎండలు నుండి తీవ్ర ఉక్కపోతల నుండి ప్రజలకు నేడు శనివారం ఉపశమనం లభించింది. నైరుతి రుతుపవనాల ఆగమనంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గత అర్ధరాత్రి నుండి నేటి శనివారం ఉదయం 7 గంటలవరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. నేటి తెల్లవారు జామున 4న్నర నుండి 5న్నర గంటల వరకు ఉరుములు మెరుపులు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. రోడ్డులు, లోతట్టు ప్రాంతాలుమాత్రమే కాదు ప్రధాన సెంటర్స్ అన్ని జలమయం అయ్యాయి. కొత్త బస్సు స్టాండ్ వద్ద నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పిడుగులా దాటికి ట్రాన్స్ ఫార్మర్స్ ట్రిప్ అవడంతో పట్టణంలో విద్యుత్తూ సరఫరాకు పలు ప్రాంతాలలో తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. చెట్టుకొమ్మలు విరిగి పడ్డాయి.మునిసిపల్ పారిశుధ్య కార్మికులు, విద్యుత్ శాఖ వారు, విస్తృతంగా శ్రమిస్తున్నారు, చల్లటి గాలులతో వాతావరణం ఆహ్లదంగానే ఉంది. మరో 3 రోజులు పాటు పశ్చిమ గోదావరి. ఉత్తర కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
