సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు దేవస్థానం లో లోక ప్రయోజనం కొరకు దుష్టశక్తుల నివారణకు భక్తులకు ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి, విజయాల కోసం కుటుంబ సౌఖ్యం మరియు గ్రహదోష నివారణ కోసం.. వచ్చే , బుధవారం (24 జూన్ 2026) సుదర్శన హోమ మహోత్సవం ఉదయం 8 గంటలకు అత్యంత వైభవముగా నిర్వహిస్తామని అని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ధమహాలక్ష్మి నగేష్, తెలిపారు. శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య ఆయుధమైన సుదర్శన చక్రం అనుగ్రహంతో జీవితంలోని అడ్డంకులు తొలగి, శుభఫలితాలు కలుగుతాయని శాస్త్రోక్త విశ్వాసం అని దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ తెలిపారు.పూర్తిగా ఉచితంగా చేస్తున్న ఈ సుదర్శన హోమంలో భక్తులు విశేషంగా పాల్గొని శ్రీ అమ్మవారు ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి “సుదర్శన కటాక్షంతో సర్వ రోగ నివారణం, సర్వ శత్రు వినాశనం, సర్వ మంగళ ప్రదానం పొందవచ్చు అని తెలిపారు.
