సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరంలో 2వ పట్టణం లో తేజ సూపర్ స్పెషలిటీ హాస్పటల్ ను తన భర్త డాక్టర్ చంద్రశేఖర్ తో కలసి నిర్వహిస్తున్న ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ .Dr. పొన్నమండ మహాలక్ష్మి నేడు, శనివారం ఆమె నివాసం లో ఉరివేసుకుని ఆత్మ హత్య చేసుకొన్నట్లు తెలుస్తుంది. అయితే కేసు ఇంకా అనుమానాస్పద మృతి? గానే భావిస్తున్నారు. పోలీస్ దర్యాప్తు లో వాస్తవాలు తెలుస్తాయి. డాక్టర్. పొన్నమండ మహాలక్ష్మి మృతి పట్ల పలువురు వైద్యులు సంతాపం తెలిపారు. ఆమె నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగాకూడా మహాలక్ష్మి పచేస్తున్నారు. ఆమె గతంలో స్థానిక మెంటే వారి తోటలో అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నడిచే వైద్య సేవా కేంద్రం లో కూడా కొంత కాలం స్వచ్చందంగా కు సేవలు అందించారు. ఆమె మరణానికి కారణం హాస్పటల్ నిర్వహణలో టెన్షన్స్ లేదా కుటుంబ వివాదాల అన్నది?పోలీస్ దర్యాప్తు లో తెలియవలసి ఉంది.
