సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నిన్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ పి మాధవ్, ఎంపీ పాక సత్యనారాయణ సమ్దక్షంలో పెదమిరం లో ప్రారంభమయిన 2రోజులు పాటు జరిగిన ఈ ప్రశిక్షణా కార్యక్రమం నేటి ఆదివారంతో ముగిసింది.బూత్ స్థాయి నుండి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి.. కష్టపడే కార్యకర్తకు ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అని శ్రీనివాస వర్మ అని పిలుపు ఇచ్చారు. పార్టీ బలోపేతం, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా క్యాడర్‌కు దిశానిర్దేశం చేసిన మధుకర్ జి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, దయాకర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. RSS మరియు బీజేపీ నేతలు సభికులనుద్దేశించి మాట్లాడుతూ.. జాతీయ సమైక్యతే పరమావధిగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని, ముందు దేశం.. తర్వాతే మనం అనే ఉన్నతమైన భావనతో ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రవచించిన ఏకాత్మ మానవతావాదం సమాజంలో చివరి వరుసలో ఉన్న వ్యక్తికి సైతం ఫలాలు అందాలనే అంత్యోదయ సిద్ధాంతాల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు సమగ్రంగా వివరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నేతలు, అయినంపూడి శ్రీదేవి లక్ష్మీ ప్రసన్న, రాష్ట్ర అధికార ప్రతినిధి, ముళ్ళపూడి రేణుక, కలిదిండి వినోద్ వర్మ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి తపన చౌదరి, బీజేపీ నాయకులు ఏపీఆర్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు. ( ఫై చిత్రంలో ఎంపీ పాక తో సిగ్మా ప్రసాద్)_
