సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మన సంప్రదాయంలో చిన్నారి బాలికలను సాక్షాత్ జగన్మాత స్వరూపాలుగా భావించి పూజిస్తారని భీమవరంలో శంభో ఫౌండేషన్ వ్యవస్థాపకులు గురూజీ శ్రీజీ అన్నారు. నేడు, సోమవారం భీమవరం ఆనంద పంక్షన్ హాల్లో దసరా శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవంలో భాగంగా బాలా త్రిపురసుందరి దేవీ అవతారం రోజున బాలికల పాదపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. 125 మంది బాలికలు పాదపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీజి గురూజీ మాట్లాడుతూ బాలికా పూజ (కుమారి పూజ) కేవలం ఒక మతపరమైన ఆచారంతోపాటు సమాజంలో ఆడపిల్లల పట్ల ఉండవలసిన అత్యున్నత గౌరవానికి నైతికతకు ప్రతీక అని అన్నారు. వారు స్వచ్ఛమైన మనసును కలిగి ఉంటారని, అందుకే వారిని దైవిక శక్తికి ప్రతిరూపాలుగా భావిస్తారని అన్నారు. పూజలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు ఆహుతులు విశేషంగా పాల్గొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *