సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి ఆలయ ఆవరణ నేడు, శుక్రవారం రాత్రి అందమైన విద్యుత్తూ దీపాలంకరణతో పాటు శ్రీ అమ్మవారి దీక్ష తీసుకొన్న వందలాది మాత ల దీపారాధనలతో శోభాయమానంగా ఉంది. నేటి రాత్రి 7న్నర కు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి మాలధారణ భక్తులచే పెద్ద దీపపు ప్రమిదలలో జ్యోతుల తో శ్రీ మావుళ్ళమ్మ మాత కు జై .. అంటూ నినాదాలతో స్థానిక మోటుపల్లి వీధి గుండా పుర విధులలో ఊరేగింపు కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆలయ ధర్మకర్తలు ch శేషగిరి రామాయణం సత్యనారాయణ ముత్యాలరామారావు, ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి యర్రంశెట్టి భద్రాజీ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *