సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: డ్రైన్లలో గుర్రపు డెక్క, నాచు, కిక్కిసను సకాలంలో తొలగించడం ద్వారా నీటి పారుదలకు అవకాశం ఉంటుందని, కాలువల ప్రక్షాళన లక్ష్యమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం గొల్లవాని తిప్ప రోడ్డులోని కనకదుర్గమ్మ గుడి వద్ద సోమవారం యనమదుర్రు కాలువలో కిక్కిస తొలగింపు పనులను నేడు, సోమవారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ,, భీమవరం వ్యాప్తంగా పంట కాలువలలో 21 కిలోమీటర్లు సుమారు రూ కోటి 50 లక్షలతో కిక్కిస తొలగింపు పనులను చేపడుతున్నారని, ఈ పనుల ద్వారా నీటి పారుదల మెరుగుపడి రైతులు నీటి ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారన్నారు. యనమదుర్రు డ్రెయిన్‌ ఇరుపక్కల దట్టంగా ఉన్న కిక్కిసను తొలగించి విస్తరించటం జరుగుతుందన్నారు. యనమదుర్రు డ్రైనేజీ కిక్కిస పై అసెంబ్లీ సమావేశాల్లో కూడా మాట్లాడటం జరిగిందన్నారు. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *