సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మార్కెట్ లో గతంలో ఏప్రిల్ మాసం వచ్చే సరికి ఏ సెంటర్ చుసిన మామిడి పండ్లు అమ్మే రిటైల్, హోల్ సేల్ వ్యాపారులు, మహిళలు కనపడేవారు. అయితే ఈ సారి సీన్ రివర్స్.. అర కోర తప్ప మార్కెట్ లో మామిడి పండ్లు అమ్మేవారే కానరావడం లేదు. ఉన్న పరక (13 కాయలు) రసాలు 600 రూపాయలు నుండి 800 రేటు చెప్పేసరికి కొనుగోలుదారుల ఉత్సహం నీరుగారిపోతుంది. ఈసారి సరుకు బాగా తక్కువని, మన ప్రాంతానికి వచ్చే మొగళ్తూరు లో రైతులు మామిడి రసాలు తోటలు తగ్గించెయ్యడం, నూజివీడు బంగినబల్లి పంట తగ్గిపోవడం తదితర కారణాలు చెపుతున్నారు. ఇదిలా ఉండగా ఇండ్లలో ఆవకాయ, మాగాయి పచ్చళ్ళు పట్టుకొనేవారికి. గత వారంతో పోల్చుకుంటే అధిక సంఖ్యలో మామిడి కాయలు వచ్చాయి. కొత్తపల్లి మామిడి అత్యధిక ధర పలుకుతుంది. 100 కాయలు రూ.2000 నుంచి 2500 వరకు పలుకుతున్నాయి. పెద్ద రసాలు రూ.1500 నుంచి 2000, చిన్న రసాలు రూ.1000 నుంచి 1500, సువర్ణరేఖ రూ.800 నుంచి 1000, కలెక్టర్ (తోతాపురి) రూ.800 నుంచి 1200 వరకు రిటైల్ గా అమ్ముతున్నారు.. ఇవే కాయలు ఇక హోల్ సేల్ గా 30 శాతం ధర తగ్గే అవకాశం ఉంది.తోతాపురి హోల్ సేల్ గా కేవలం రూ.600నుంచి 1000 మధ్య అమ్ముతున్నారు.
