సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా అహంకారం ఎక్కడైనా చెల్లుతుందేమో కానీ ఇరాన్ వద్ద కాదని వారిని ఒకటి కొట్టి 4 చోట్ల కొట్టించుకొంటున్న చందన సుమారు 6 నెలలుగా సాగుతున్న యుద్ధం తీరు ప్రపంచానికి అర్ధం అయిపొయింది. ఇక చేసేది లేక మరల యుద్ధ విరామం ప్రకటించి ఇరాన్ తో చర్చలకు సిద్దమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజగా ఇరాన్‌తో చర్చలపై క్లారిటీ ఇచ్చారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇరుపక్షాల మధ్య ఒక ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా ప్రకటించారు. అయితే నేడు సోమవారం మధ్యాహ్నం నుంచే ఇరాన్‌తో అమెరికా చర్చలు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ట్రంప్ అన్నారు. తాను ప్రజలను చంపాలనుకోవటం లేదని శాంతి వచనాలు తెలిపారు.. ఈసారి చర్చలు ఎలా సాగుతాయో వేచి చూడాలి. నేను ప్రజలను చంపాలనుకోవట్లేదు. ఎందుకంటే సైనిక దాడుల వల్ల చాలా మంది చనిపోతారు. అది నాకు ఇష్టం లేదు’ అని స్పష్టం చేశారు.
