సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: న్యూఢిల్లీ:లోకేంద్రమంత్రి శ్రీనివాస వర్మ నివాసం లో నేడు, శనివారం ఉదయం ఏర్పాటు చేసిన‘ఆత్మీయ అల్పాహార విందు’కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామా కృష్ణంరాజు తో పాటు పలువురు పార్లమెంట్ సభ్యులు, ఆంధ్ర రాష్ట్ర శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో సమావేశమయ్యారు.తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో పాత వాహనాల స్క్రాప్‌తో ఉక్కును రీసైక్లింగ్ చేసే పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ సందర్భంగా ఆయన వినతిపత్రం అందించారు. వాటిని పరిశీలించి కేంద్రం నుండి తగిన సహకారం అందిస్తానని శ్రీనివాస వర్మ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *