సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో తాగునీటి సంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ, “జలధారా – జలహారతి” కార్యక్రమాన్ని కమిషనర్ కె. రామచంద్ర రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక ప్రజలు నీటి వనరులను కాపాడటం, పరిశుభ్రతను పెంపొందించడం మరియు సుస్థిర అభివృద్ధి సాధించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు., నీరు మన నిత్యా జీవితానికి అమూల్యమైన వనరు అని, దానిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పరిరక్షణ, చెరువులు మరియు కాలువల శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, భూగర్భ జలాలు ఇంకిపోకుండా చూసుకోవాలని సూచించారు. అవసరానికి మించి నీటి వృథాను నివారించడం ఫై చిన్నారులు ప్రజలు ద్రుష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో MHO సోమశేఖర్, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది మరియు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *