సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి, తోట సీతారామలక్ష్మి చేతులమీదుగా ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ ఓ సి దరఖాస్తుదారులుకి 4లక్షల 50 వేల రూ మంజూరి పత్రాలను స్థానిక టిడిపి నాయకుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. టిడిపి రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ,, నియోజకవర్గ ఇన్చార్జి తోట సీతారామలక్ష్మి సిఫార్సుతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నేటికీ సుమారు మూడు కోట్ల రూపాయలను 205 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. టిడిపి సీనియర్ నాయకుడు మైలబత్తుల ఐజాక్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులు టిడిపి ఇన్చార్జులు ప్రతి శుక్రవారం ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తూ వారి సమస్యలను పరిష్కరింప చేస్తున్నారని ప్రతి శుక్రవారం నియోజకవర్గ ఇన్చార్జ్ తోట సీతారామలక్ష్మీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తు వారి సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అర్జీదారులు, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *