సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సంగీతం వినోద సాధనం మాత్రమే కాదని, ఘంటసాల గళం గాత్ర మాధుర్యం తెలుగు ప్రజలకు ఒక వరమని బ్రాహ్మణా కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకట్రామయ్య, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీన బేగం అన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 103వ జయంతిని పురస్కరించుకుని పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నేడు, మంగళవారం భీమవరం శ్రీసోమేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో సంగీత విద్వాంసులు చిప్పాడ నాగేశ్వరరావుచే ఘంటసాల గానామృత కార్యక్రమాన్ని నిర్వహించారు. . అనంతరం నాగేశ్వరరావు ఆలపించిన ఎన్టీఆర్ భక్తి గీతాలు అందరిని ఆకట్టుకున్నాయి. నాగేశ్వరరావు ను అభినందించి నగదు ప్రోత్సాహంతో సత్కరించారు. కార్యక్రమంలో ఎద్దు ఏసుపాదం,మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్ చెరుకు తిరుపతిరావు, మాదాసు కనకదుర్గ, గంగాధర్ తిలక్, ఆలయ సభ్యులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *