సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో గత 75 రోజుల కాలానికి శ్రీ అమ్మవారి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకల ఆదాయాన్ని నేడు, మంగళవారం లెక్కించగా ..హుండీల ద్వారా (రూ 61,06,458/- అరవై ఒక లక్ష ఆరువేల నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు) లభించగా, బంగారం 76 గ్రాములు 700 మిల్లీగ్రాములు, వెండీ 315 గ్రాములు కానుకలుగా లభించాయి. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు మరియు కరూర్ వైశ్య బ్యాంకు సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఆలయ య సిబ్బంది, రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలనుండి 180 మంది సేవకులు పాల్గొన్నారని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *