సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో మీడియాతో సీఎం చంద్రబాబు చిట్‌చాట్ చేశారు. వైసీపీ నేతలు ‘సర్’పై కోర్టుకెళ్లారని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్.. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎప్పుడైనా ప్రకటించవచ్చని అన్నారు. అయితే జగన్ కు స్థానిక సంస్థల ఎన్నికలు జరగటం ఇష్టం లేదని ,స్థానిక ఎన్నికలు జాప్యం జరిగే కొద్ది అధికార పార్టీకి నష్టం కలుగుతుందనే ఆశ వైసీపీకి ఉందని ఎద్దేవా చేశారు. మునిసిపల్ ఎన్నికలు లో చైర్మెన్ మేయర్ లు ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరగడమే మేలు అని తాము భావిస్తున్నామని, స్థానిక ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరగడమే మేలని అప్పుడే రాజకీయ స్థిరత్వానికి నాంది పలుకుతామని అన్నారు. ఎన్నికలు కాస్త ఆలస్యంగా జరిగితే తమ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందని జగన్ అండ్ కో భావిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ పార్టీలో మరో పవర్ సెంటర్ అనేది కరెక్ట్ కాదని.. నేతలు కలిసి పనిచేసుకోవాలని సూచించారు. ఆది సంస్థాగతంగా కూడా మంచిదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడమనేది చట్టపరమైన రక్షణ మాత్రమేనని సీఎం చంద్రబాబు తెలిపారు.
