సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నేడు, గురువారం విజయవాడలో జన ఆక్రోశ పాత్రికేయుల సమావేశంలో ఆయన ఎన్.డి.ఏ (NDA) కూటమి మహిళా నేతలతో కలిసి ఆయన మాట్లాడారు… ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక మహిళా సాధికారతకు పెద్దపీట వేశారని, అందులో భాగంగానే ‘నారీ శక్తి వందనం’ చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా ముందుకు తెచ్చారని 2023 మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింప చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుంది అని పేర్కొన్నారు. అయితే చట్టసభల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించాలనేది మోదీ ప్రభుత్వ దృఢ సంకల్పమని , అయితే ఆ రిజర్వేషన్ సవరణ బిల్లును ఇటీవల పార్లమెంట్ లో కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి కేవలం 54 ఓట్ల తేడాతో బిల్లును ఓడించి, దేశవ్యాప్త మహిళల ఆశలను కాంగ్రెస్ దెబ్బతీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో కేంద్రం మహిళా రిజర్వేషన్ తో పాటు ఒకేసారి డి లిమిటేషన్ నియోజక వర్గాల పెంపు బిల్లులు పెట్టి ఉత్తరాది సీట్లు పెంచుతున్నారని, ఇటీవల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఇప్పటికైనా ఆ పార్టీలు గ్రహించి మహిళా సవరణ బిల్లుకు మద్దతు పలకాలీ అని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కోరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కేవలం 12.6 శాతం మందే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారని, ఈ సంఖ్య పెరగాలంటే రిజర్వేషన్లు తప్పనిసరని ఆయన పేర్కొన్నారు.
