సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి లో కోస్తా సముద్ర తీరంలో వేలాదిగా ఉన్న ఏపీలో ఉన్న లక్షలాది మంది మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం మత్స్యకార భరోసా నిధులను విడుదల చేయనుంది. భీమవరం, నరసాపురం తీరప్రాంత సముద్రంలో చేపల వేటపై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో, అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ. 20,000 చొప్పున నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ. 286 కోట్లను విడుదల చేయనుంది. ఈ లబ్ధిదారుల అకౌంట్లలోకి మే 19 వ తేదీ నుండి నేరుగా నగదు జమ కానుంది.మే 19న డబ్బులు పడగానే లబ్ధిదారులు egsws.ap.gov.in పోర్టల్ ద్వారా తమ పేమెంట్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.. దీనికి కారణం మత్యకారులు సముద్రంలో మత్య సంపద సంతానోత్పత్తికి అనువైన కాలం గత్ ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు (మొత్తం 61 రోజులు) సముద్రంలో యాంత్రిక, మోటారు బోట్లతో వేట సాగించడాన్ని పూర్తిగా నిషేధించారు. ఈకాలంలొ నష్టపోయిన మత్యకార కుటుంబాలకు ఈ పధకం వర్తిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *