సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 7 ఏళ్లుగా హిట్ లేని విజయ్‌ దేవరకొండ అభిమానులంతా ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రణబాలి’పై ఆశలు పెట్టుకున్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన పీరియాడిక్‌ మూవీ ‘రణబాలి’ నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి సినిమా కధ విషయానికి వస్తే.. ఇది 1854 నుంచి 1878 మధ్య రాయలసీమ నేపథ్యంలో బ్రిటిష్ దొర ల మరణ కాండ ఫై తిరుగుబాటు చేసిన యోధుడు కధ .. శింగనమల కోటకు చెందిన రణబాలి (విజయ్‌ దేవరకొండ) కారణ జన్ముడు. తల్లి రాజమ్మ (ఈశ్వరీరావు) చనిపోయిన బిడ్డను ప్రసవించి, ఊరి దేవుడు భద్ర మల్లన్నను శరణువేడితే, ఆయన ఆ బిడ్డకు ప్రాణం పోసి, రెండు పుష్కారాలు జీవించి, తన బాధ్యతలను ముగించాక సమాధి అవుతాడని చెబుతాడు. అలా ఊరికోసం కొడుకును పెంచిన రాజమ్మ, యుక్తవయసులో రణబాలిని జయమ్మ (రశ్మిక మందణ్ణ)కు ఇచ్చి పెళ్ళి చేస్తుంది. అదే సమయంలో రాయలసీమ లోని క్వాలిటీ ధాన్యాన్ని ఆంగ్లేయ అధికారి హెక్టర్‌ (ఆర్నాల్డ్ ఓస్లూ.. మమ్మి విలన్ ) బ్రిటన్‌ కు పంపడానికి ఉవ్విళ్ళూరు తుంటాడు. అలా చేస్తే కమీషనర్‌గా ఉన్న తనను క్వీన్ విక్టోరియా గవర్నర్‌ను చేస్తుందనే ఆశ అతనికి! ప్రజల ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడని కిరాతకుడైన హెక్టార్‌ కు రణబాలి ఎలా బుద్ధి చెప్పాడు? తన ప్రాంతంలో కరువుతో అల్లాడుతున్న ప్రజల ఆకలిని ఎలా తీర్చాడు? అనేది ఈ చిత్ర కథ. సినిమా ఎలా తీశారంటే.. అయినవారి కుట్ర కారణంగా అసువులు బాసిన రణబాలి ఆ తర్వాత భద్ర మల్లన్న రూపంలో రాయలసీమ ప్రజలకు అండగా నిలిచాడని అక్కడి వారు ఇప్పటికి నమ్ముతారు. బ్రిటిషర్స్… భారతీయులను బానిసలుగా చూసిన సైకో మనస్తత్వాన్ని బాగా ఆవిష్కరించారు. ప్రేక్షకులకు చరిత్ర కు బాగా దగ్గరగా వెళ్లి చుసిన ఆ కాలపు అనుభూతి చెందుతారు.దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ పడ్డ శ్రమ తెరపై కనపడుతుంది. మొదటి భాగం కాస్త విజయ్ రష్మిక ల రొమాన్స్ రిలీఫ్ ఇస్తే.. సెంకండ్ భాగం దారుణమైన హింసతో భారీ సన్నివేశాలతో సహనానికి పరీక్ష పెడుతుంది. కాస్త నిడివి తగ్గించవచ్చు. ఇక విజయదేవరా కొండా పాత్ర కోసం ప్రాణం పెట్టేసాడు. అంత కష్టపడ్డాడు. ఇక రష్మిక సహజంగా నటించింది. మమ్మి విలన్ ..ఆర్నాల్డ్ ఓస్లూ తన క్రూరమైన నటనతో భయం పుట్టించాడు. సంగీతం కాస్త సినిమా బలం తగ్గించింది. అయితే టాలీవుడ్ చేసిన గొప్ప ప్రయత్నంగా ‘రణబాలి’ని అందరు చూడాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *