సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: భీమవరం రైతు బజార్ వెనుక ప్రభుత్వ బాలికల హాస్టల్ లోని 90 మంది విద్యార్థులకు ఆదివారం రగ్గులు, స్వేటర్స్, టర్కీ టవల్స్, నైట్ డ్రెసెస్ లను ఎమ్మెల్యే అంజిబాబు అందించి మాట్లాడారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి పాటు పడాలన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని అన్ని రంగాలలో రాణించాలని, వారికి కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా పాటు పడాలని సూచించారు. విద్యార్థులకు ప్రభుత్వ అందజేసిన విద్యా సామాగ్రిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏకాగ్రతతో చదివి మంచి మార్కులు సాధించాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.
