సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: షిరిడి సాయి బాబా వారు ప్రజలకు శ్రద్ద సహనం తో పాటు అన్న దానం మించిన మహాత్కారం లేదని ప్రభోదించారని, అన్నదానం ఎంతో గొప్పదని, దైవ కార్యక్రమాల్లో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం దైవ సేవతో సమానమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం మండలం రాయలం గ్రామంలో శ్రీవిజయ సాయిబాబా వారి మందిర 8వ వార్షిక మహోత్సవాన్ని నేడు, గురువారం నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు సాయిబాబా వారిని దర్శించుకుని అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 8 ఏళ్లుగా బాబావారి వార్షిక మహోత్సవాలను సాంప్రదాయ బద్దంగా నిర్వహిస్తున్న సభ్యులను అభినందించారు. ముందుగా కలిదిండి సీతారామరాజు, భారతీ దంపతులు, అల్లం రమేష్, సత్యవాణి దంపతులచే పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తులు సాయిబాబా వారి ప్రసాదాన్ని స్వీకరించారు.
