సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లోని పవిత్ర పంచారామా క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వారి దేవస్థానం నందు ప్రతి రోజు దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు జరుగు శాశ్వత నిత్యాన్నదానమునకు భీమవరం వాస్తవ్యులు నిమ్మల మణికుమార్ శ్రీమతి స్వప్న దంపతులు వారి బాబు దినేష్ పేరున ప్రతి సంవత్సరం మార్చి 14వ తేదీ అన్నదానం చేయుటకు శాశ్వత నిత్య అన్నదానమునకు రూ 1,00,116 /-రూపాయలు కానుకగా సమర్పించారు.. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీ చింతలపాటి బంగార్రాజు మరియు ప్రధాన అర్చకులు చెరుకూరి రామకృష్ణ గారు మరియు కొత్తపల్లి శ్రీనివాస్ అభిషేక్ పండిట్ మరియు భక్తులు పాల్గొని ఉన్నారు. అని దేవాలయ కార్యనిర్వాహణాధికారి, డి రామకృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
