సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత సోమవారం భారీ లాభాలను సాధించిన దేశీయ సూచీలు నేడు, మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే మెల్లగా నష్టాల నుంచి కోలుకుని లాభాల బాట పట్టాయి. .గత సోమవారం సెషన్ ముగింపు (77,303)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 300 పాయింట్ల నష్టంతో 77,094 వద్ద మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కోలుకుంది. ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 127 పాయింట్ల లాభంతో 77,430 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 70 పాయింట్ల లాభంతో 24,162 వద్ద కదలాడుతోంది (stock market ).సెన్సెక్స్‌, నిఫ్టీలో నిప్పాన్, ఆయిల్ ఇండియా, కోల్ ఇండియా, ఆర్బీఎల్ బ్యాంక్, వొడాఫోన్ ఐడియా మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 216 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 165 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 94.47గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *