సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ లో ప్రమాదవశాత్తు గాయపడడంతో ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ భీమవరం లోని పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీసోమేశ్వర జనార్ధన స్వామి దేవాలయంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు బాలయ్య అభిమానులు మద్దుల రాము, విజ్జురోతి రాఘవులు ,తదితరులు ఆధ్వర్యంలో నేడు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి అర్చనలు నిర్వహించి బాలకృష్ణ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని ప్రజా సేవతో పాటు సినీ చిత్రీకరణల్లో తిరిగి చురుకుగా పాల్గొనాలని అభిషేకాలు నిర్వహించారు. ఒకవైపు రాజకీయం మరోవైపు సినీ రంగంలో దిగ్విజయంగా రాణిస్తున్న బాలకృష్ణ త్వరగా కోలుకోవాలన్నారు.
