సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీవెంకట సాయిబాబా మందిర 15వ వార్షిక మహోత్సవంలో భాగంగా నేడు, బుధవారం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, టీడీపీ సీనియర్ నేత మెంటే పార్ధసారధి పాల్గొని బాబావారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించి ఆశీర్వచనం అందించారు. సాయిబాబా నామాలను పఠించడం ద్వారా వ్యక్తి ఆధ్యాత్మిక అనుభూతి ని అనుభవిస్తారని అందుకే సాయిబాబాను కోట్లాది మంది భక్తులు నిత్యం స్మరించుకుంటారని, కోరిన కోరికలు తీర్చుతాడని భక్తుల నమ్మకమని, కష్టాల్లో భక్తులు బాబాను దర్శించుకుంటే తమ కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని విశ్వసిస్తుంటారన్నారు. 15 ఏళ్లుగా సాంప్రదాయ బద్దంగా వార్షిక మహోత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. అధిక సంఖ్యలో భక్తులు బాబావారిని దర్శించుకున్నారు. ఈనెల 23వ తేదీన బాబావారి అన్నాభిషేకం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
