సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని వాడవాడలా శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను స్థానిక యువత ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా చక్కగా నిర్వహించుకొంటున్నారు. తాజగా భీమవరం పట్టణంలోని 14,18,25,26వ వార్డు, సుంకర పద్దయ్య వీధిలోని ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద జాతర కమిటీ నిర్వహించిన శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఎమ్మెల్యే అంజిబాబు కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. ఇటువంటి జాతర మహోత్సవాలు పట్టణ, గ్రామ శాంతిని కోరుకుంటాయని, అమ్మవారి కరుణ కటాక్షలు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. అనంతరం శక్తి వేషాలతో గరగల నృత్యాలతో, కాంతార వేషధారణలు, బుట్ట బొమ్మలు, శివ పార్వతులు, అఘోరాలు వంటి వేషధారణ ప్రదర్శనలతో వాడవాడలా అమ్మవారి జాతర మహోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా వార్డుల జాతర కమిటీ సభ్యులు, మహిళలు భక్తులు పాల్గొన్నారు.
