సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్దానిక దంతులూరి నారాయణరాజు కళాశాలలో నేడు, మంగళవారం విద్యాప్రదాత, స్వాతంత్ర సమర యోదులు కీర్తిశేషులు శ్రీ దంతులూరి నారాయణరాజు గారి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి కళాశాల ప్రాంగణంలోని ఆయన విగ్రహానికి కళాశాల యాజమాన్యం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకటనరసింహరాజు, కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు(బాబు) హజరు అయ్యారు. వారిరువురు మాట్లాడుతూ.. దంతులూరి నారాయణరాజు గారు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి విశేష సేవలు అందించారని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం అనంతరం కూడా ఆయన తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసి, ముఖ్యంగా విద్యా రంగ అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడని వివరించారు.వారి ఆశయాలు కొనసాగిస్తూ ప్రస్తుత కళాశాల యాజమాన్యం ముందుకు సాగుతుందని అన్నారు. ఈ రోజు కోపల్లె గ్రామంలో ఈ రోజు దంతులూరి నారాయణరాజు గారి విగ్రహాన్ని ఘనంగా ప్రతిష్ఠించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు నారయణరాజు కళాశాల అసోసియేషన్ ఆద్యార్యంలో నడుచుచున్న వివిధ విద్యాసంస్దల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
