సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి శనివారం ఉదయం 10న్నర నుండి భీమవరం లో మంద కృష్ణ మాదిగ పర్యటన నేపథ్యంలో ఎస్సీ నేతల ర్యాలీ నేపథ్యంలో ప్రధాన అంబెడ్కర్ సెంటర్ నుండి ప్రకాశం చోక్ వరకు ట్రాఫిక్ స్తంభించి ఎర్రటి ఎండలో వాహనదారులు కొంత ఇబ్బంది ఏర్పడింది.. ఇక ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ కుముదవల్లి రోడ్డు లోని ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ‘రాజ్యాంగం ఎస్సీలకు కల్పించిన సామాజిక స్థితి అవగాహన సదస్సు’లో మాట్లాడుతూ.. ఎస్ సి కులాల వారు మతం మారితే ఎస్సీ రిజర్వేషన్లు పొందలేరని,ఎస్ సి కుల హోదా కోల్పోతారని ఇటీవల సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధం అన్నారు. షెడ్యూల్ కులాల వారు క్రైస్తవమో మరొక మతమో తీసుకున్నంత మాత్రాన వారి యొక్క సామాజిక హోదా సామాజిక గౌరవం సమాజంలో ఎక్కడా ఏమి పెరగదు అన్నారు. కులం, మత వివక్షత ఉన్నంతకాలం ఎస్సీలు ఎస్టీలు ఇతరులకు రిజర్వేషన్లు అమలు చేయవలసిందే అన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ద్వారా ఏదైనా మతాన్ని దైవాన్ని పూజించుకునే హక్కు ప్రచారం చేసుకునే హక్కు కల్పించిందన్నారు. ఆకివీడు పెద్ద పేట రామాలయం అంశంపై ..దళిత వర్గాలకు చెందిన వారిని ఎవరు ఇబ్బంది పెట్టినా, ఆత్మ గౌరవం దెబ్బ తీసేలా వ్యవహరించినా ఉరుకునేది లేదని హెచ్చరించారు.కూటమి విజయానికి తాము సహకరిచామనీ రామాలయం వివాదాన్ని తానే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్తానని ప్రకటించారు.. ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ ఉన్న పార్టీకి మేలు చేయాలే తప్ప కీడు చేయకూడదని పేర్కొన్నారు. క్రైస్తవ మతంలోకి గిరిజనులు ఇతర కులాల వారు కూడా వెళ్లారని అయితే ప్రత్యేకంగా ఎస్సీల్ని మాత్రమే నేడు అగ్రవర్ణాలు, కొందరు పార్టీ నాయకులు లక్ష్యంగా ఎంచుకున్నారని.. దళితులకు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగడానికి కల్పించడానికి తాను జాతీయస్థాయిలో ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. జాతీయ స్థాయిలో ఎస్సీ ఎస్టీ హక్కుల కోసం ఆందోళనలు సమావేశాలు నిర్వహిస్తామన్నారు. నేటి రాత్రి మందకృష్ణ భీమవరంలో శాసనమండలి చైర్మెన్ మోషన్ రాజును కలవనున్నారు.
