సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:నేటి శుక్రవారం నుంచి మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఏపీ స్థానిక సంస్థల (పట్టణ, గ్రామీణ) ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలో విజయవాడలోని ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు. ప్రజల నుండి , అభ్యర్థుల నుండి ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణ కోసం ఈ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటుందని ఈసీ వెల్లడించింది. ఫిర్యాదులు, సమస్యల కోసం (0866) 2490023, 2490024, 2490025, 2490026 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని ప్రకటించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *