సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ లో యుద్ధ విరమణ శాంతి ఒప్పందం కుదరడంతో వరుసగా రెండో రోజూ కూడా దేశీయ సూచీలు లాభాలు ఆర్జించాయి. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర మరింత తగ్గి 82.90 డాలర్లకు చేరుకుంది. మరోవైపు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (94.56) బలపడింది. వరుసగా రెండో రోజు కూడా సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతోనే రోజును ముగించాయి ( stock market).గత సెషన్ ముగింపు (76,264)తో పోల్చుకుంటే నేడు మంగళవారం ఉదయం దాదాపు 300 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ చివరకు 544 పాయింట్ల లాభంతో 76,808 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే చివరకు 135 పాయింట్ల లాభంతో 23,989 వద్ద స్థిరపడింది బ్యాంక్ నిఫ్టీ 98 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 252 పాయింట్లు సాధించింది.
