సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు.. అన్న చందంగా అమెరికా ప్రజల ప్రయోజనాలు, ఇక్కడ ఎన్నికలు ముఖ్యమని ట్రంప్ రష్యా తో ఆయిల్ దిగుమతి ఒప్పందం కుదుర్చుకొని పుతిన్ కు ‘కృతఙ్ఞతలు’ చెప్పడం తో ప్రపంచం నివ్వెరపోయింది. దీనితో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ట్రంప్ ఫై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పడు అమెరికా ఇచ్చిన డబ్బుతో రష్యా తమపై మరింత దాడులు చేస్తుందని ఇదేమి మోసమని ఆవేదన చెందారు. దీనితో అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఎడం అంతకంతకూ పెరుగుతోంది. రష్యా ఆయిల్ రిఫైనరీలపై ఉక్రెయిన్ దాడుల ను సహియించబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గట్టివార్నింగ్ ఇచ్చారు. రష్యా ఇంధన మౌలిక వసతులపై దాడులను తక్షణం కట్టిపెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఉక్రెయిన్ ప్రజలు రష్యాతో డీల్ కుదుర్చుకోగలిగే నాయకుడిని ఎన్నుకోవాలని కూడా ఉచిత సలహా ఇచ్చేసారు. .ఇక రష్యా డీజిల్ చమురు ఎగుమతులను సులభతరం చేసేలా ఆంక్షల సడలింపునకు అమెరికా సిద్ధమైంది. ఈ పరిణామాలపై ఉక్రెయిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తాజా పరిణామాలు భారత్ కు ఎంతో మేలు చేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రధాని మోడీ,జై శంకర్ ముందు నుండి జెలెన్‌స్కీకి కి యుద్ధం వద్దు ఇది సమయం కాదు, నువ్వు నమ్మిన వారే నిన్ను ముంచేస్తారు అని చెపుతూనే ఉన్నారు.. వింటేగా …ప్రపంచం గుర్తుంచుకునే ఈ వెన్నుపోటుతో యుద్ధం ఆగిపోతుంది.
