సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి జేష్ఠ మాస జాతర మహోత్సవాలు రేపు సోమవారం సాయంత్రం 5-30 నిమిషాల నుండి ప్రారంభమౌతాయి. రేపు సాయంత్రం జేష్ఠమాస ప్రారంభంగా శ్రీ అమ్మవారి ని ప్రత్యేక పూజలు తదుపరి నిలబెట్టడం జరుగుతుందని దేవాలయ కార్యాలయం తెలియజేసింది. ఈ జేష్ఠమాసం లో శ్రీ అమ్మవారి ప్రతి రూపంగా వెండి ఘట్టాలను నెత్తి మీద పెట్టుకొని కళాకారులు పట్టణంలోని అన్ని వీధులు తిరుగుతూ ఇంటింటికి వెళ్లి అమ్మవారి అస్సిసులు అందజేస్తారు. ప్రతి ఇంటా మహిళలు వారికీ పసుపు నీళ్లు తో స్వాగతం పలికి, బియ్యం, బెల్లం పసుపు కుంకుమలతో.. తమ కుటుంబాలకు రక్షణ, సుఖశాంతులు ఇచ్చే అమ్మవారిని ఆహ్వానించడం సంప్రదాయం.
