సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తెలుగు రాష్ట్రాలలో విజయవాడలోని కృష్ణలంక సీఐ నాగరాజు వరుస వివాదాలు సంచలనం రేపుతున్నాయి. అవి కాస్త జనసేన తో పాటు కూటమి సర్కార్ ను ఇరుకున పెడుతున్నాయి. ఇప్పటికే జనసేన కార్యకర్త . తమ కుమారుడు సాయికృష్ణను సీఐ నాగరాజు లాకప్ డెత్ చేశాడని, నెల రోజులుగా త్రిప్పిస్తున్నాడని , దేహాన్ని కూడా కాల్చివేశారని అతని తల్లి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా. ఆమె కుటుంబానికి మద్దతు ఇస్తూ వైసీపీ నేతలతో పాటు పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ ఆమె ఇంటికి వెళ్లి ఆమెను వాదర్చడం తో ‘డామేజ్’ గమనించిన ప్రభుత్వం ఆగమేఘాలపై సీఐ నాగరాజు ను సస్పెండ్ చెయ్యడం విచారణ కు ఆదేశించడం జరిగింది., తదుపరి నేడు, శుక్రవారం సీఎం చంద్రబాబు సాయికృష్ణ కుటుంబ సభ్యులను తన వద్దకు రప్పించుకొని సాయి కృష్ణ మృతి ఫై విచారణ చేయించి దోషులు ఎవరిని వదలమని హామీ ఇచ్చారు.. ఇదిలా ఉండగా.. తాజాగా మరో వ్యక్తి సూసైడ్ సెల్ఫీ వీడియో వైరల్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన చావుకు సీఐ నాగరాజే కారణమని, గత 3 నెలలుగా తనను వేటాడి, వెంటాడి మరీ కొడుతున్నాడని. క్రాంతి కుమార్ అనే వ్యక్తి.. పేర్కొనడం గమనార్హం. ఈ వీడియో పాతది కాగా.. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. ఈ క్రాంతి కుమార్ అనే వ్యక్తి.. ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పోరిపోగు వెంకటేశ్వరరావు కుమారుడు అని తెలుస్తోంది. ఇక చూస్కోండి.. సీఐ నాగరాజు చుట్టూ పెద్ద ఉచ్చు బిగుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *