సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ప్రధాన సెంటర్ కూడలి ప్రకాశం చౌక్ వద్ద విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన మెయిన్ విద్యుత్ ట్రాన్స్ ఫారమ్ నేటి శనివారం ఉదయం ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ వల్ల. భారీగా మంటలు చెలరేగి దట్టమైన పొగలతో పేలుడులు సంభవించాయి. అదృష్టవ శాత్తు ఎవరు గాయపడలేదు. దీనితో అక్కడే ఉండే ట్రాఫిక్ పోలీసులు తో పాటు వాహన దారులు భయకంపితులు అయ్యారు. సమాచారం అందటంతో వెంటనే అధికారులు పట్టణంలో విద్యుత్ సరఫరా కొద్దీ సేపు నిలిపివేశారు. ఆఘమేఘాలపై ఫైర్ సర్వీస్ సిబ్బంది వచ్చి వచ్చి మంటల్ని అదుపు చేశారు.. ఈ ప్రమాదం జరగడానికి ముందే అదే ప్రకాశం చౌక్ సెంటర్ లో నేటి ఉదయం ‘క్లీన్ స్లీప్’ కార్యక్రమం స్థానిక మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వందలాది మధ్య పెద్ద ఎత్తున నిర్వహించారు. గత 3 రోజులుగా పట్టణంలో చెలరేగుతున్న ఎండలు దాటికి పలు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.
