సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుతం సికింద్రాబాద్ నుండి విశాఖ కు వందేమాతరం ఎక్స్ ప్రెస్ రైలు నడుస్తున్న విషయం… దానిని ఏలూరుతో పాటు తాడేపల్లి గూడెంలో కూడా రైలు నిలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా విషయం విదితమే.. ఇదిలా ఉండగా.. విశాఖ- తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును నడపడానికి రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోందని తాజా సమాచారం. దీనివల్ల పశ్చిమ గోదావరి ప్రయాణికులకు అదనపు ప్రయోజనం జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు గత ఆదివారం సాయంత్రం చెన్నై నుంచి 16 బోగీలతో కూడిన కొత్త వందేమాతరం రైలు విశాఖకు బయలుదేరింది. అయితే దీనిపై వాల్తేరు రైల్వే అధికారులు ప్రస్తుతానికి అధికారికంగా స్వాదించక పోయినప్పటికీ ట్రయిల్ రన్ నిర్వహించుకొని త్వరలో ఈ రైలునే విశాఖ-తిరుపతి మధ్య నడుపుతారనే ప్రచారం సాగుతోంది.. చూడాలి శ్రీవారి సన్నిధికి తొందరగా చేరాలనుకునే భక్తులకు వందేమాతరం ఎంత తొందరగా అందుబాటులోకి వస్తుందో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *