సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం ఏపీ ఎన్జీవో సంఘం నిర్వహించిన సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎన్జీవో సంఘం సభ్యు లం దరికీ శుభాకాం క్షలు. మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల ఇబ్బందుల గురించి, ఎంతో నిజాయితీగా ఉద్యోగుల సమస్య లను పరిష్కరించాం. మీకు ఇంకా పెండింగ్లో ఉన్న డీఏలో ఒకటి దసరా కానుకగా అందిస్తాం అని హర్షద్వానాల మధ్య ప్రకటించారు. సీఎం జగన్ తన ప్రసంగంలో .. రాష్ట్రంలో తాము లక్షకు పైగా కొత్త ఉద్యొగులను పర్మినెంట్ చేశామని 2019 నుండి మొత్తం 3 లక్షల 19 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు కలిగిన వ్యవస్థను మెరుగుపరిచేలా అడుగులు వేశామని, 53 వేల మందిని హెల్త్ సెక్టార్లో నియమించామని అందుకే ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన వర్గానికి నా మీద కడుపు మంట అని అన్నారు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శముగా నిలుస్తూ ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ను తీసుకొచ్చాం. జీపీఎస్ పెన్షన్ స్కీమ్కు రేపో, ఎల్లుండో ఆర్డినెన్స్ వస్తుంది. అయితే చంద్రబాబు హయాంలో 54 ప్రభుత్వరంగ సంస్థలను మూసేశారు. గతంలో జన్మ భూమి కమిటీల పేరుతో చంద్రబాబు అడ్డగోలుగా దోచుకున్నారు. ఉద్యోగుల్లో చంద్రబాబు ఏ వర్గాన్నీ పట్టిం చుకోలేదు. ఉద్యోగులంతా లంచగొండులని బాబుకు ఎంతో దారుణమైన అభిప్రాయాలున్నాయి,ఇటీవల పుంగనూరులో 47 మంది పోలీసులపై దాడి చేసి గాయాలు పాలు చేసారు. ఒక పోలీసు కన్ను పోగొట్టారు అని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *