సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని తీవ్రవాయుగుండం కొనసాగుతుంది. కలింగపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 100 కిలోమీటర్ల దూరంలోనూ, గోపాల్‌పూర్‌కి 150 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 180 కిలోమీటర్ల దూరంలో తీవ్రవాయుగుండం కేంద్రీకృతమై ఉన్న నేపథ్యంలో నేటి బుధవారం రాత్రికి కానీ రేపు గురువారం జామున కానీ విశాఖపట్నం – గోపాల్‌పూర్ మధ్య, కలింగపట్నానికి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.తుఫాన్ ప్రభావంతో ఏపీలో ఉత్తర ఆంధ్ర , కృష్ణ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీమవరం తో పాటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుండి వర్షపు ముసురు తో నేటి బుధవారం వరకు వర్షపు జల్లులు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ వర్షాలు నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా, ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని పాఠశాలలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది.
