సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి సోమవారం జూన్ 1 నుండి నూతనంగా విశాఖ రైల్వే జోన్ ప్రారంభం కావడం పట్ల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ.. మీడియా తో మాట్లాడుతూ… విశాఖ రైల్వే జోన్ కోసం తాను పార్లమెంట్లో అనేక పర్యాయాలు పోరాడానని రైల్వే జోన్ సాధన కోసం ఆ రోజుల్లో ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్లో దీక్ష చేపట్టినట్లు గుర్తుచేశారు. నేడు కేంద్ర మంత్రిగా ఉండి దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. నేటి నుంచి విశాఖపట్నం నుంచి పరిపాలన ప్రారంభమైందన్నారు. ఇచ్చాపురం మండలం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం ఏ.ఏస్ పేట వద్ద సౌత్ కోస్ట్ రైల్వేజోన్ స్వాగత బోర్డ్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ప్రభుత్వ విప్ అశోక్ ఆవిష్కరించారు
