సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వరుస సూపర్ డూపర్ హిట్స్ తో దూసుకొనిపోతున్న విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో సురేష్ ప్రొడక్షన్స్, ఫై నిర్మిస్తున్నారు. దీనికి జీ స్టూడియోస్ సహనిర్మాణంలో.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2027 సంక్రాంతి టార్గెట్‌గా రానున్న ఈ మూవీ నేడు, గురువారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సక్సెస్ ఫుల్ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు.నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ చిత్రయూనిట్‌కు స్ర్కిప్ట్ అందించి ఆశీస్సులు అందించారు. క్లాప్ సన్నివేశం విషయానికి వస్తే.. కీర్తి సురేష్‌పై కళ్యాణ్ రామ్, కృతి శెట్టిపై వెంకటేష్ చేతులు వేసుకుని నిలబడి ఉండగా.. క్లాప్ పడింది. అయ్యో ఇదేంటి.. అని వెంకీ, కళ్యాణ్ రామ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోగా వెంటనే హీరోయిన్లు తమ ప్లేస్‌లను మార్చుకున్నారు. వెంకీ సరసన కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి ఇందులో నటిస్తున్నారు. ఈ ఫస్ట్ షాట్‌కు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం ఏకే 47’ సినిమా దసరా కు విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *