సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం మూడు దశల్లో నిర్వహిస్తోంది. తొలి విడత పోలింగ్ నిన్న గురువారం జరగ్గా.. గత రాత్రి ఫలితాలు వెల్లడయ్యాయి. తొలి విడతలో 3,949 సర్పంచ్ పదవులకు నోటిఫికేషన్ విడుదల కాగా.. వాటిలో 760 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 3,189 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. ఏకగ్రీవాలులేకుండా కలపకుండా ఎన్నికలలో ఓటింగ్ ద్వారా టీడీపీ మద్దతు దారులు ‘1561 స్థానాలలో విజయం’ సాధిస్తే.. ( ఏకగ్రీవాలు కూడా కలుపుకొని 2,321 కూటమిలోని మిగిలిన పార్టీలైన జనసేన పార్టీ మద్దతుదారులు 118, బీజేపీ మద్దతుదారులు 25 పంచాయతీల్లో విజయం సాధించారు.) ఎన్ని వివాదాలు, ఆటంకాలు ఎదురైనా వైసీపీ మద్దతుదారులు ఊహించని రీతిలో విజృంభించారు. ఏకంగా ‘1103 పంచాయతీల్లో విజయం‘ సాధించారు. 295 స్థానాల్లో ఇతర పార్టీల సానుభూతిపరులు, స్వతంత్రులు విజయం సాధించారు. మూడు చోట్ల రీ పోలింగ్ నిర్వహిస్తుండగా.. మిగిలిన చోట్ల ఫలితాలు రావాల్సి ఉంది.
