సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సమీపంలోని కాళ్ళ మండలం, బొండాడ గ్రామంలో నూతన దేవాలయంలో “శ్రీ కృష్ణ విగ్రహ ప్రతిష్ఠ మరియు శిఖర ప్రతిష్ఠ మహోత్సవం” కార్యక్రమంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పాల్గొన్నారు. శ్రీ కృష్ణ విగ్రహం ఆవిష్కరణ తదుపరి ఆయనకు దేవాలయ నిర్వాహకులు కాషాయ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీ రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ.. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన హోమాది కార్యక్రమాలలో గ్రామ ప్రజలతో కలిసి నేను పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని చక్కటి గుడిని నిర్మించిన దేవాలయ నిర్వాహకులను అభినందించారు.
