సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా బాధ్యతలు చెప్పటి తన 25 ఏళ్ల ప్రజా సేవ పూర్తయిన సందర్భంగా నేడు, బుధవారం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో మోదీ ప్రసంగించారు. దేశ అభివృద్ధి లక్ష్యాలకు మరింత ఊపునిచ్చేలా ‘మనం సాధిస్తాం’ అనే సంకల్పంతో భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు దేశం చిన్న చిన్న లక్ష్యాలతో సంతృప్తి చెందకూడదని, భారీ లక్ష్యాలు, ఆశయాలతో ముందుకు సాగాల్సిన సమయం ఇదేనని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు ఐదు కీలక లక్ష్యాలను ప్రకటించారు. ప్రపంచంలోని టాప్-3 ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ను నిలపడం, ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించడం, ప్రపంచ ఉత్త్పతుల తయారీ కేంద్రంగా ఎదగడం, ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం, అంతరిక్షంలో మానవుడిని అడుగుపెట్టించడం తమ ప్రధాన సంకల్పాలని ప్రధాని తెలిపారు. మోదీ ఒక్కో లక్ష్యాన్ని ప్రస్తావించిన ప్రతిసారీ సభలోని ప్రజలు, కార్యకర్తలు ‘మనం సాధిస్తాం’ అంటూ ఉత్సాహంగా నినాదాలు చేసారు.
