సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం వద్ద నేడు, మంగళవారం ‘చల్లని మజ్జిగ చలి వేంద్రాన్ని‘ ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ప్రతి ఏడాది మావుళ్ళమ్మ దేవస్థాన సభ్యులు దాతల సహకారంతో ఏర్పాటు చేయడం శుభ పరిణామమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. వేసవిలో ప్రతిఒక్కరూ ప్రధాన కూడలిలో ఇటువంటి మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ముందుగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. కార్యక్రమంలో దాత రావాడ రామ్మోహన్ రావు, మరియు ధర్మ కర్తల మండలి సభ్యులు ఆలయ సిబ్బంది , భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *