సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో మిగతా రాష్ట్రాలలో ఒకదారి ..మన తెలుగు రాష్ట్రాలది మరో దారిఏపీలో ఇప్పటికే చాల ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరతతో బంకులు మూసివేశారు. కొన్నిచోట్ల పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్నా.. కిలోమీటర్ల కొద్దీ కారులు, ఆటోలు, ఇతర వాహనదారులు బారులు తీరారు.. అన్ని వర్గాలు ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నాయి.దేశంలో ఎక్కడ లేని విధంగా తెలుగు రాష్ట్రాలలో ఈస్థాయిలో పెట్రోల్, డీజిల్ కొరతకు కారణాలు ఏమిటి..? కొందరు అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా లేదని తెలుస్తోంది. అయితే మీడియాలో కొందరి తప్పుడు ప్రచారం వల్ల వాహనదారులు భారీ సంఖ్యలో పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లి ట్యాంకులు ఫుల్ చేయించుకుంటున్నారు. దీంతో రెండు రోజుల్లోనే మూడు రెట్లు అమ్మకాలు పెరిగి బంకులు తాత్కాలికంగా ఖాళీ అయ్యాయి.దీనికి తోడు.. ఇక్కడ అవకాశాలను దారుణంగా అందిపుచ్చుకొనే స్వార్ధ పరులు ఎక్కువ అయ్యిపోయారు.దీని వల్ల పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని చెబుతున్నారు . మరో విశ్లేషణ ఏమిటంటే.. ఈనెల 29వ తేదీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రెండో విడత పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. తదుపరి వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘రెడీ’ అయిందనే వార్తలు వస్తున్నాయి. దీంతో రేట్లు పెరిగాక అమ్ముకోవచ్చనే ఆశతో చాల మంది స్టాక్ దాచిపెడుతున్నారనే అనుమానాలను వాహన దారులు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే పల్లెలలో పలు చోట్ల పెట్రోల్ లీటర్ 200/- కు రిటైల్ గా బ్లాక్ అమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయి.కొందరురాజకీయ పెద్దల అండతో బ్లాక్ మార్కెట్ యథేచ్ఛగా జరిగిపోతుంది. ఏది ఏమైనారాజకీయాలు అధికార బలాలు ప్రక్కన పెట్టి అధికారులు ‘స్వయం నిర్ణయాలు’ తీసుకొంటేనే ఈ పెట్రోలు సమస్య నుండి ప్రజలను రక్షించినవారుఅవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *