సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ పట్నం కు చెందిన మాజీ జనసేన నేత , ప్రముఖ పర్యావరణ వేత్త, బొలిశెట్టి సత్యనారాయణ సోషల్ మీడియా X వేదికగా .. గత జగన్ ప్రభుత్వ హయాంలో రుషికొండ ఫై సుమారు 400 కోట్లతో నిర్మించిన ఆధునిక ప్రభుత్వ భవనాల నిర్మాణం విషయంలో కేంద్ర నిపుణుల కమిటీ పర్యావరణ నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఇటీవల ఇచ్చిన రిపోర్ట్ ఇవ్వడం మంచిదేనని హర్షం ప్రకటిస్తూ.. అయితే ఇటీవల కూటమి అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలోని ఏకంగా పవిత్ర సింహాచలంలో ఎన్నో కొండలను గూగుల్ డేటా సెంటర్ కోసం యథేచ్ఛగా ధ్వంసం చేస్తుంటే పర్యావరణ శాఖ అధికారులు, ఎందుకు అడ్డు చెప్పటం లేదని, గతంలో ఒక్క ఋషి కొండఫై హడావిడి చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు 10 కొండలు నిబంధనలకు విరుద్ధంగా తొలగిస్తుంటే ఎందుకు మౌనంగా? ఉంటున్నారని నిలదీశారు. ఈ రెండు నాలుకల వైఖరి ఏమిటని ఎక్స్ వేదికగా ఆయన ప్రశ్నించారు.
