సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: వచ్చే ఏడాది రానున్న గోదావరి పుష్కరాలకు పశ్చిమ గోదావరి జిల్లాలో భక్తులకోసం ఏర్పాటు చేస్తున్న స్నానాల రేవుల టెండర్లు ఖరారయ్యాయి. అయితే ఎన్ని కల కోడ్ ఉండటంతో పనులు పెండింగ్ పడ్డాయి, డిసెంబర్ 2వారం నుండి పనులు పూర్తీ స్థాయిలో ప్రారంభమవుతాయి. సిద్దాంతం నుంచి నరసాపురం మండలం బియ్యపుతిప్ప వరకు ఉన్న గోదావరి పరివాహక ప్రాంతాల్లో 35 స్నా నాల రేవుల విస్తరణ, అభివృద్ధి, కొత్త రేవుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.39.13 కోట్లు కేటాయించింది. జిల్లాలో ఈసారి నాలుగు స్నానాల ఘాట్లను విస్త రిస్తున్నారు. వాటిలో నరసాపురం అమరేశ్వర, వలంధర్, యలమంచిలి లక్ష్మిపాలెం, సిద్దాంతం రేవులు ఉన్నాయి. వలంధర్ రేవును 40 మీటర్ల నుంచి 80 మీటర్లకు పెంచుతున్నారు. సిద్దాంతంలో మూడు రేవులను ఒకటిగా చేసి 140 మీటర్ల అతి పెద్ద రేవు నిర్మిస్తున్నారు. దీనికి రూ.4 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆచంట మండలంలో 10 రేవులులో పాత రేవులను నూతన హంగులతో ఆధునీకరిస్తు న్నారు
