సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:ఇటీవల జపాన్ లో ప్రారంభమయిన 2026 ఆసియా క్రీడల్లో నేడు, మంగళవారం పైనల్ లో మన భారత క్రికెట్ అమ్మాయిలు అదరగొట్టారు. ఈ మెగా ఈవెంట్‌లో భారత్ కు తొలి స్వర్ణ పతకం సాధించారు. మహిళల క్రికెట్ ఫైనల్‌లో శ్రీలంకను భారత్ ఓడించింది. హర్మన్ ప్రీత్ సేన అద్భుత ప్రదర్శనతో మన దేశానికి స్వర్ణ పతకం దక్కింది. ఫైనల్‌లో లంకపై భారత్ 147 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 3 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన లంక 69 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఖాతాలో గోల్డ్ మెడల్ పడింది. కాగా.. అంతకుముందు కాంస్య పతకం కోసం జరిగిన పోరులో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ విజయం సాధించింది. దీంతో పాక్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *