సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:. ఏపీలోని తిరుపతి కి సమీపంలోని ప్రతిష్టాకర ‘శ్రీసిటీ పారిశ్రామికవాడలో నేడు శనివారం తెల్లవారు జాము శ్రీసిటీలోని టిల్‌ హెల్త్‌కేర్‌ పార్మా పరిశ్రమలో బాయిలర్‌ పేలినట్లు సమాచారం. నైట్‌ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న పలువురు కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు తీవ్ర గాయాలు పాలయినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మొదట ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం అందగా.. ఆ తర్వాత మృతుల సంఖ్య ఐదుగురికి చేరినట్లు తెలుస్తోంది. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన నెలకొంది. ప్రమాదంపై సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *