సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) 2026 ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ (X) వేదికగా నేడు, బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 1,82,317 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, ఉత్తీర్ణత శాతం 70.52గా నమోదైంది. అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లలో 63,546 మంది అభ్యర్థులు అర్హత పొందగా, ఉత్తీర్ణత శాతం 89.59గా ఉంది.విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ 9552300009 ద్వారా కూడా తమ ఫలితాలను అతి సులభంగా చూసుకోవచ్చు, ఫలితాల్లో అర్హత సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ర్యాంకుల ఆధారంగా త్వరలో నిర్వహించే ప్రముఖ కాలేజీలు కౌన్సెలింగ్‌కు విద్యార్థులు సిద్ధం కావలసి ఉంది.
