సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:ఇటీవల గోదావరి జిల్లాలలో.. ఆర్ధిక సమస్యలు కావచ్చు, వేదింపులు కావచ్చు . వీటిని తట్టుకోలేక గోదావరి నది లో దూకెయ్యడంతో తమ జీవితాలను చాలించి అన్ని సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చు అనే ‘క్షణిక ఆవేశం’ ధోరణి ఇటీవల బాగా పెరిగిపోయింది. తాజగా నేడు,శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాలో ఓకే కుటుంబానికి చెందిని నలుగురు గోదావరి నదిలో దూకేయడం కలకలం రేపుతోంది. యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై నుంచి (తణుకు నుంచి రెండు బైక్‌లపై వచ్చిన కుటుంబం.. నలుగురు కుటుంసభ్యులు) గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నంబూరి శ్రీనివాస్ (45), పద్మిని (42), ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. వీరు నదిలోకి దూకడాన్ని చూసిన మత్యకారులు అప్రమత్తమై భార్య నంబూరి పద్మిని ని మత్యకారులు కాపాడారు. అలాగే, భర్త శ్రీనివాస్, ఇద్దరు పిల్లల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు ఆర్థిక సమస్య వల్ల ఈ అఘాయిత్యానికి యత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాణాలతో బయటపడ్డ పద్మిని నుంచి వివరాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది.
