సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు శుక్రవారం మంచి జోష్ తో దూసుకుపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, దేశీయంగా ఇన్వెస్టర్ల కొనుగోళ్ల మద్దతుతో అటు సెన్సెక్స్, ఇటు నిఫ్టీ రెండు కూడా ఉదయం ప్రారంభం నుండి భారీ లాభాలను నమోదు చేశాయి. ఇవాళ మార్కెట్స్ ముగిసే సమయానికి 23,622.90 వద్ద నిఫ్టీ ముగియగా, 75,527.95 దగ్గర సెన్సెక్స్ ముగిసింది. . బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 1695.41 పాయింట్లు లాభపడి కీలక మైలురాయిని అధిగమించింది, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 461.30 పాయింట్లు పుంజుకుని సరికొత్త రికార్డు స్థాయిల వద్ద వారాంతాన్ని ముగించింది.పశ్చిమాసియాలో యుద్ధం ముగిసే సూచనలు, అమెరికాలో ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం,తో గ్లోబల్ మార్కెట్లు పుంజుకున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తిరిగి భారత మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *